ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. టెన్త్ పరీక్షల్లో 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ఫలితాల్లో బాలికలదే పై చేయి అని పేర్కొన్నారు. పరీక్షలలో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38శాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షా ఫలితాలలో పార్వతీపురం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. నంద్యాల జిల్లా చివరి స్థానంతో సరిపెట్టుకుంది. గతేడాది కంటే ఈసారి 5 శాతం ఉత్తీర్ణత పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3.47 శాతం ఉత్తీర్ణత పెరిగిందని వెల్లడించారు. రీ కౌంటింగ్, వెరిఫికేషన్‌కు ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం పేర్కొన్నారు. ఈ నెల 17లోపు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. జూన్ 2 నుంచి 10 వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విదార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ వెబ్సైట్ bse.ap.gov.inలో చూసుకోవచ్చు.