అటు ఏపీ ఎన్నికల కమిషనర్, ఇటు ప్రభుత్వం మధ్య కొన్ని రోజులుగా వార్ కొనసాగుతోంది. సర్పంచ్ ఎన్నికలకు ముందు నుంచి ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటోంది. ఇక తాజాగా ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు వాలంటీర్లతో ఎన్నికల పనులు చేయించొద్దని స్పష్టం చేశారు. ఒక వేళ పనులు చేయించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇవి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ తాజాగా జారీ చేసిన ఆదేశాలు. ఒక వేల ఎవరైనా వాలంటీర్లను ఎన్నికలకు వినియోగిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అతిక్రమించినట్లేనని ఆయన అన్నారు. వార్డు వాలంటీర్ల వ్యవస్థపై ఫిర్యాదు చేయాల్సి వస్తే కాల్ సెంట్‌కు కాల్ చేయవచ్చని అన్నారు.
SECY.APSEC2@Gmail.com కూడా మెయిల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. అయితే ఫిర్యాదు వచ్చిన వెంటనే జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డు వాలంటీర్లు ఓటర్లను సంప్రదించడం, ప్రభావితం చెయ్యడం వంటివాటిని తీవ్ర నేరాలుగా పరిణనిస్తామ, అలాంటి విషయంలో తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. కాగా, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ కూడా కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌లో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న పనులను, పథకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లయితే వెంటనే చర్యలకు దిగుతోంది ఈసీ. తాజాగా కూడా వార్డు వాలంటీర్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ వైసీపీ నేతలు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మండిపడుతున్నారు. ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈసీ పలు నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తున్నారు. ఎవరు ఆరోపణలు చేసినా.. ఈసీ తన పని తాను చేసుకుంటూపోతోంది.