ఏపీ కరోనా బులిటెన్.. పెరిగిన కేసులు.. తగ్గని మరణాలు
AP records more than 12000 Corona cases in 24 hours. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 98,048
By Medi Samrat Published on
2 Jun 2021 11:49 AM GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 98,048 శాంపిళ్లను పరీక్షించగా.. 12,768 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 17,17,156కి చేరింది. నిన్న 15,612 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 15,62,229కి పెరిగింది.
కోవిడ్ వల్ల చిత్తూర్ లో పదిహేను మంది, నెల్లూరు లో పది, పశ్చిమ గోదావరి లో తొమ్మిది, అనంతపూర్ లో ఎనిమిది, తూర్పు గోదావరి లో ఎనిమిది, విజయనగరం లో ఎనిమిది, గుంటూరు లో ఏడుగురు, ప్రకాశం లో ఏడుగురు, శ్రీకాకుళం లో ఏడుగురు, విశాఖపట్నం లో ఆరుగురు, కృష్ణ లో ఐదుగురు, వైఎస్ఆర్ కడప లో నలుగురు, కర్నూ ల్ లో నలుగురు చొప్పున మొత్తం 98 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11,132కి చేరింది. ఇక రాష్ట్రంలో 1,43,795 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 1,94,48,056 సాంపిల్స్ ని పరీక్షించారు.
Next Story