ఏపీలో నేడు ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే కరోనా వైరస్ కారణంగా గత 18 నెలలుగా మూసివున్న విద్యాసంస్థలు.. ఏపీలో గత నెల 16 నుండి ప్రారంభమయ్యాయి. అయితే ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై జీవో 53 విడుదల చేసింది. గ్రామ, మున్సిపాల్టీ, కార్పోరేషన్ వారీగా ప్రభుత్వం ఫీజులను నిర్ధారించింది. అయితే ఆ జీవో పై ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు నిరసనలకు పిలుపునిచ్చారు. కరోనా తగ్గుముఖం పడుతున్న తరుణంలో విద్యాసంస్థలు తెరుచుకోవడంతో కొన్ని పాఠశాలలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో విద్యార్థులు, టీచర్లతో పాటు ఇతర స్కూల్ సిబ్బంది వైరస్ బారిన పడుతున్నారు.
తాజాగా కురబలకోట మండలంలోని ఓ పాఠశాలలో 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నెల్లూరు జిల్లా కోట మండలం చిట్టేడు ఎస్టీ గురుకుల పాఠశాలలో కరోనా కేసులు బయటపడ్డాయి. ఒక ఉపాధ్యాయుడితోపాటు ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. భయం భయంగా తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపుతున్న వేళ.. కరోనా కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.