పోలీసులపై టీడీపీ నేతల వ్యాఖ్యలు బాధాకరం అని పోలీసుల అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. మేం రాజ్యాంగానికి, చట్టానికి కట్టుబానిసలం.. ప్రజల రక్షణకు కట్టు బానిసలం అని అన్నారు. టీడీపీ నేతల నిరాధారమైన ఆరోపణలు సరికాదని అన్నారు. మా పోలీసుల వలన ఇబ్బందులు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు.. కానీ నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని అన్నారు. టీడీపీ నేత చెంగల్రాయుడి మాటలు గర్హనీయం.. ఆయన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. న్యాయమూర్తుల దగ్గర అబద్ధాలు ఆడమని.. పోలీసులు కొట్టరాని చోట కొట్టారని.. చెప్పమంటారా..?! ఇవేం మాటలని మండిపడ్డారు.
లా పట్టా పొందిన చెంగల్రాయుడు పోలీసులను, న్యాయ వ్యవస్థను ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడం సరికాదని అన్నారు. టీడీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలీసు నా కొడుకులు అంటారా..? బట్టలూడదీసి కొడతామంటారా..? మావి రాజకీయ పదవులు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంగల్రాయుడి మాటలు సిగ్గు చేటు.. చంద్రబాబు వెంటనే పోలీసులకు క్షమాపణ చెప్పాలి. చెంగల్రాయుడి మాటలను చంద్రబాబు సమర్దిస్తున్నారా..? స్పందించాలని అన్నారు.