ఉత్కంఠకు తెరపడింది. ఏపీ కొత్త కేబినెట్ ఖరారైంది. 25 మందితో ఏపీ కొత్త మంత్రివర్గ జాబితా విడుదలైంది. కేబినెట్ కూర్పులో ముఖ్యమంత్రి జగన్ సామాజిక సమతుల్యతను పాటించారు. దీంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీటి వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.
కేబినెట్ పైనల్ లిస్టు..
గుడివాడ అమర్నాథ్
దాడిశెట్టి రాజా
బొత్స సత్యనారాయణ
రాజన్నదొర
ధర్మాన ప్రసాదరావు
సీదిరి అప్పలరాజు
జోగి రమేష్
అంబటి రాంబాబు
కొట్టు సత్యనారాయణ
తానేటి వనిత
కారుమూరి నాగేశ్వరరావు
మేరుగ నాగార్జున
బూడి ముత్యాలనాయుడు
విడదల రజిని
కాకాణి గోవర్ధన్‌రెడ్డి
అంజాద్ భాష
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
పినిపె విశ్వరూప్
గుమ్మనూరు జయరాం
ఆర్కే రోజా
ఉషశ్రీ చరణ్
తిప్పేస్వామి
చెల్లుబోయిన వేణుగోపాల్
నారాయణస్వామి
ఇదిలావుంటే.. గత కెబినెట్‌లోని మంత్రుల రాజీనామాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. ముఖ్యమంత్రి సలహా మేరకు కొద్ది నిమిషాల క్రితం రాష్ట్ర గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 24 మంది మంత్రుల రాజీనామాలకు ఆమోదం తెలిపారు. రాజీనామాల ఆమోదంపై అధికారిక గెజిట్ విడుదల కానుంది. మరి కొద్దిసేపటిలో రాజ్ భవన్ కు నూతన మంత్రుల జాబితా చేరనుంది. గవర్నర్ పరిశీలన అనంతరం ఆమోదం తెలపనున్నారు.