ఏపీ కొత్త కేబినెట్.. లక్కీ ఛాన్స్ ఎవరిని వరించిందంటే..
AP New Cabinet Ministers. ఏపీలో కొత్త క్యాబినెట్ కు సంబంధించి 25 మందితో సీఎం జగన్ నూతన మంత్రివర్గ జాబితాను ఖరారు చేశారు.
By Medi Samrat Published on 11 April 2022 10:14 AM ISTఏపీలో కొత్త క్యాబినెట్ కు సంబంధించి 25 మందితో సీఎం జగన్ నూతన మంత్రివర్గ జాబితాను ఖరారు చేశారు. ఇందులో పలువురు సీనియర్ మంత్రులకు మళ్లీ అవకాశమిచ్చారు. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి, గుమ్మనూరు జయరాం, సీదిరి అప్పలరాజు, అంజాద్ బాషా, నారాయణస్వామి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తానేటి వనిత, ఆదిమూలపు సురేశ్ కొత్త మంత్రివర్గంలోనూ స్థానం సంపాదించుకున్నారు. వారికి ఏ శాఖలు కేటాయిస్తారన్నది ఇంకా తెలియరాలేదు. కొత్తగా మంత్రివర్గంలో చోటు సంపాదించినవారిలో రోజా, అంబటి రాంబాబు, జోగి రమేశ్ తదితరులు ఉన్నారు.
చిలకలూరిపేట ఎమ్మెల్యే రజని తనకు మంత్రి పదవి దక్కడంపై స్పందించారు. మంత్రి పదవి దక్కుతుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. సీఎం జగన్ సర్ ప్రైజ్ చేశారని తెలిపారు. సీఎం జగన్ ఓ సాధారణ బీసీ మహిళనైన తనను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కల్పించారని, ఇప్పుడు మంత్రిగా అవకాశం ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. తొలిసారి ఎమ్మెల్యేనైన తనకు తాజాగా మంత్రి బాధ్యతలు అప్పగించారని, సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయనని రజని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటే నడుస్తానని రజని అన్నారు.
నూతన మంత్రివర్గంలో ఉన్నది వీరే!
1. బొత్స సత్యనారాయణ
2. సీదిరి అప్పలరాజు
3. ధర్మాన ప్రసాదరావు
4. పీడిక రాజన్నదొర
5. గుడివాడ అమర్నాథ్
6. బూడి ముత్యాలనాయుడు
7. దాడిశెట్టి రాజా
8. పినిపే విశ్వరూప్
9. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
10. తానేటి వనిత
11. కారుమూరి నాగేశ్వరరావు
12. కొట్టు సత్యనారాయణ
13. జోగి రమేశ్
14. అంబటి రాంబాబు
15. మేరుగ నాగార్జున
16. కాకాణి గోవర్ధన్ రెడ్డి
17. అంజాద్ బాషా
18. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
19. గుమ్మనూరు జయరాం
20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
21. నారాయణస్వామి
22. రోజా
23. ఉషశ్రీ చరణ్
24. ఆదిమూలపు సురేశ్
25. విడదల రజని