ఏపీలో ఎనిమిది మంది ఎమ్మెల్సీల పదవీ కాలం నేటితో ముగియనుంది. దీంతో కౌన్సిల్‌లో స్థానిక సంస్థల కోటా కింద ఖాళీలు 11కు చేరనున్నాయి. అయితే.. స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పరిషత్ ఎన్నికలను హై కోర్టు రద్దు చేసిన నేఫథ్యంలో స్థానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కానుంది. ఇక టీడీపీ నుంచి ఏడుగురు, వైసీపీ నుంచి ఒక సభ్యుడి పదవీ కాలం నేటితో ముగియనుంది.
టీడీపీ నుంచి రెడ్డి సుబ్రమణ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, పప్పల చలపతి రావు, గాలి సరస్వతి, ద్వారపు రెడ్డి జగదీశ్వరరావు, బుద్దా నాగ జగదీశ్వరరావుల పదవీ విరమణ పొందుతుండగా.. వైసీపీ నుంచి మండలిలో వైసీపీ చీఫ్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రిటైర్ కానున్నారు. టీడీపీ సభ్యుల పదవీ కాలం ముగియడంతో మండలిలో వైసీపీ సంఖ్యా బలం పెరగనుంది. కౌన్సిల్లో వైసీపీ సంఖ్యా బలం 21కి చేరనుండగా.. టీడీపీ బలం 15కి పడిపోనుంది.