జమ్మలమడుగు ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్
హైదరాబాద్ నానక్‌రామ్ గూడలో ఈగల్ టీమ్ తనిఖీలు చేపట్టింది.
By - Medi Samrat |
హైదరాబాద్ నానక్‌రామ్ గూడలో ఈగల్ టీమ్ తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీలలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి పట్టుబడ్డాడు. గంజాయి తీసుకుంటూ దొరికిన సుధీర్‌రెడ్డికి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడిని అరెస్టు చేసి డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. గతంలో రెండుసార్లు డ్రగ్స్ కేసులో దొరికిన సుధీర్.. గత కొంత కాలంగా డిప్రెషన్‌లో ఉన్నట్లు ఈగల్ టీమ్ గుర్తించింది.
పక్కా సమాచారంతో సుధీర్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టగా.. అతడితోపాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురికి టెస్టులు నిర్వహించగా.. సుధీర్ రెడ్డికి మాత్రమే గంజాయి పాజిటివ్ రాగా, మిగిలిన ఇద్దరికీ నెగిటివ్ వచ్చింది. దీంతో సుధీర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని డీ ఆడిక్షన్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నారు. గంజాయి ఎవరు సరఫరా చేశారనే కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కేసు ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది.