శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో రు. 43.08 కోట్లతో ప్రసాద్ స్కీం కింద వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సోమవారం ఉదయం 11-45 గంటలకు కర్నూలు జిల్లా సున్నిపెంట హెలిప్యాడ్ కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము వెంట తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిలై సాయి సౌందరాజన్ కూడా కర్నూలుకు వచ్చారు. సున్నిపెంట హెలిప్యాడ్ వద్ద రాష్ట్రపతి, తెలంగాణా గవర్నర్ కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, భారత పర్యాటక అభివృద్ధి, సంస్కృతి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానంద రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, ఏడి జిపి ఎల్ఎల్ఓ రవిశంకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు.