మంత్రి విశ్వరూప్ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందంటే..!

AP Minister Vishwaroop Health Update. తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌

By Medi Samrat  Published on  3 Sept 2022 4:36 PM IST
మంత్రి విశ్వరూప్ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందంటే..!

తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ హెల్త్‌ బులెటిన్‌ను హైదరాబాద్‌ వైద్యులు విడుదల చేశారు. హైదరాబాద్‌ సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా అమలాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్‌ పాల్గొన్నారు. అనంతరం ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో కిందపడిపోయారు. ఆయనను అమలాపురంలోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. బ్రెయిన్‌ స్టోక్ కు గురైనట్లు గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రి నుంచి హైదరాబాద్ కు తరలించారు.

విశ్వ‌రూప్ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం అస్వ‌స్థ‌త‌కు గురవ్వగా వైద్య చికిత్సల కోసం ఆయ‌నను రాజ‌మ‌హేంద్ర‌వరంలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. విశ్వ‌రూప్‌కు వైద్యం అందించిన డాక్ట‌ర్లు ఆయ‌న స్వ‌ల్పంగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన‌ట్లుగా తేల్చారు. ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం మెరుగైన వైద్యం కోసం హైద‌రాబాద్ వెళ్లాల‌ని ఆయ‌న‌కు వైద్యులు సూచించారు. దీంతో శుక్ర‌వారం రాత్రి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం నుంచి విశ్వ‌రూప్‌ను ఆయ‌న కుటుంబ స‌భ్యులు హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు.


Next Story