చరిత్ర సృష్టించాలన్న, తిరగరాయాలన్న చంద్రబాబుతోనే సాధ్యం: లోకేశ్
చరిత్ర సృష్టించాలన్నా..దానిని తిరగరాయాలన్నా చంద్రబాబుతోనే సాధ్యం..అని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
By - Knakam Karthik |
చరిత్ర సృష్టించాలన్న, తిరగరాయాలన్న చంద్రబాబుతోనే సాధ్యం: లోకేశ్
అమరావతి: చరిత్ర సృష్టించాలన్నా..దానిని తిరగరాయాలన్నా చంద్రబాబుతోనే సాధ్యం..అని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్‌పై ఢిల్లీలో ఒప్పందం తర్వాత ఆయన అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల దేశానికి, రాష్ట్రానికి మంచిది. చరిత్ర సృష్టించాలన్నా దానిని తిరగరాయాలన్నా అది చంద్రబాబు తోనే సాధ్యం. 2014-19మధ్య కియా ఏర్పాటుతో చరిత్ర సృష్టించాం. ఆ చరిత్రను తిరగరాస్తూ 15బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి గూగుల్ విశాఖ లో పెడుతోంది. అమెరికా వెలుపల గూగుల్ పెడుతున్న అతిపెద్ద డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది ఉద్యోగాలు వస్తాయి..అని లోకేశ్ పేర్కొన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ మొదటిస్థానంలో ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం. దానికి కట్టుబడి ఉన్నాం. అహర్నిశలు పని చేస్తున్నాం. ఒక్క ఐటీ రంగంలోనే ఛాలెంజ్‌గా తీసుకుని 5 లక్షల ఉద్యోగాలు కల్పించాం. రాబోయే రోజుల్లో కూడా ప్రతి వారం ఉద్యోగ ప్రకటనలు ఉంటాయి. ఏ ఒక్క కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్లిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నాం. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఏ ఒక్క కంపెనీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు..కేవలం విధ్వంస పాలన కారణంగానే పెట్టుబడులు రాలేదు. అలాంటిది 17 నెలల్లోనే ఇన్వెస్ట్‌మెంట్స్‌లో సెంటర్ ఆఫ్ డిస్కషన్‌గా ఏపీ నిలిచింది..అని లోకేశ్ వ్యాఖ్యానించారు.