పార్టీ నేతలంతా కలిసి పనిచేస్తున్నారని, పార్టీలో తనకు ఎవరితోనూ విభేదాలు లేవని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి మంగళవారం మాట్లాడుతూ.. ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలు పెంచేందుకే కొందరు ఫ్లెక్సీలను చించివేశారని.. ఎవరూ కావాలని ఫ్లెక్సీలను తొలగించరని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తో విభేదాలపై కాకాణి మాట్లాడుతూ.. తాను అనిల్ కుమార్ ఫ్లెక్సీలను చించనని అన్నారు.
కోర్టులో జరిగిన చోరీపై కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందిస్తూ.. సోమిరెడ్డి 2017లో తనపై కేసు పెట్టారని, టీడీపీ ప్రభుత్వం హయాంలో రెండు సార్లు చార్జిషీట్ దాఖలు చేయడంతో అది సరైన కేసు కాదని కోర్టు తేల్చిచెప్పిందని గుర్తు చేశారు. సీపీ అధికారంలోకి రాగానే చార్జిషీట్ దాఖలు చేసిందని.. దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వివిధ రకాల ప్రయోజనాల కోసం కొందరు పథకం పన్నారని మంత్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగతనం కేసులో టీడీపీకి ఏమైనా సందేహాలుంటే హైకోర్టు ద్వారా సీబీఐ విచారణ జరిపించాలని కోరవచ్చని అన్నారు.