ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి కన్నుమూత

AP Minister goutham reddy passed away. ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూశారు. సోమవారం తెల్లవారజామున మంత్రి గౌతమ్‌

By అంజి
Published on : 21 Feb 2022 3:57 AM

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి కన్నుమూత

ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూశారు. సోమవారం తెల్లవారజామున మంత్రి గౌతమ్‌ రెడ్డికి గుండెపోటు వచ్చింది. ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కూలబడిపోయారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గౌతంరెడ్డిని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. గౌతం రెడ్డి వైద్యుల చికిత్స ప్రతిస్పందించలేదు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

మంత్రి గౌతమ్‌రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లోనూ ఇదే నియోజకవర్గం నుండి గౌతమ్‌ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌ రెడ్డి. ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. ఇటీవలే గౌతమ్‌ రెడ్డి దుబాయ్‌ పర్యటనకు వెళ్లి వచ్చారు. గౌతమ్‌ రెడ్డి మృతి వారి కుటుంబలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి చెందిన విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

Next Story