ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు నెలకు రూ.1500 ఇచ్చే పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ బహిరంగ సభలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మేం ఇప్పటికే అన్ని హామీలు నెరవేర్చాం. ఒక్క మహిళలకు నెలకు రూ. 1500 ఇచ్చే పథకం మాత్రమే అమలు చేయాల్సి ఉంది. మా పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో భాగమైన దీన్ని అమలు చేయాలంటే ఆంధ్రానే అమ్మేయాలి..అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
మహిళలకు నెలకు రూ. 1500 ఇచ్చే మహాశక్తి పథకం ఇవ్వాలంటే ఆంధ్రానే అమ్మాల్సిన అవసరం ఉందని, అంత డబ్బు అవసరం ఉందని ఏం చేయాలంటూ అచ్చెన్న ప్రశ్నించారు. దీని కోసం ఏం చేయాలనే విషయంపై సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని అచ్చెన్న వెల్లడించారు. మిగతా పథకాలు మాత్రం పక్కాగా అమలు చేశామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ పథకంపై మాత్రం త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.