ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ -2022 ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. ఫస్టియర్‌లో 2,41,591 మంది పాస్ కాగా, ఫస్టియర్‌లో 54 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. సెకండియర్‌లో 2,58,449 మంది పాస్ కాగా, 61 ఉత్తీర్ణత శాతం రికార్డు అయ్యింది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది.
మే 6 నుంచి జూన్ 28 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,69,059 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఓకేషనల్‌లో 79 వేల 22 మంది పరీక్ష రాశారు. అమ్మాయిలు ప్రథమ సంవత్సరంలో 54 శాతం.. ద్వితీయ సంవత్సరంలో 61 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో బాలురు 49 శాతం.. బాలికలు 65 శాతం ఉత్తీర్ణత పొందారు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 59 శాతం.. బాలికలు 68 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతలో ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్‌లో నిలువగా, చివర్లో ఉమ్మడి కడప జిల్లా నిలిచింది.