ఇంట‌ర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

AP Inter Supplementary Results Released. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్‌ అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ మొదటి సంవత్సరం, రెండో సంవత్సర పరీక్షల

By Medi Samrat
Published on : 23 Oct 2021 8:23 PM IST

ఇంట‌ర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్‌ అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గత సెప్టెంబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు ప‌రీక్ష‌లు జ‌రిగాయి. ఫస్టియర్ పరీక్షలకు 3, 24, 800 మంది విద్యార్థులు హాజ‌రుకాగా, సెకండియర్‌ పరీక్షలకు 14,950 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్కుల రీ వెరిఫికేషన్ కు, రీకౌంటింగ్ కు ఈనెల 26 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఒక్క పేపర్ రీకౌంటింగ్ కు రూ.260 చొప్పున, రీ వెరిఫికేషన్ కు పేపర్ కు రూ.1300 చెల్లించాల్సి ఉంటుంది.

రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్లకు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రామక్రిష్ణ తెలిపారు. విద్యార్థుల మార్కుల మెమోలను ఈనెల 25వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి 'https:bie.ap.gov.in' ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫలితాలకు సంబంధించిన గ్రీవెన్స్‌ను 'ourbieap@gmail.com'' ద్వారా లేదా 391282578 వాట్సాప్‌ నంబర్ల‌కు సంప్రదించవచ్చని ఇంటర్ బోర్డ్‌ కార్యదర్శి తెలిపారు.


Next Story