జులై నెలాఖరులో ఏపీ ఇంటర్ పరీక్షలు..!
AP Inter Exams. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
By Medi Samrat Published on 23 Jun 2021 6:52 PM ISTటెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. జులై చివరిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అఫిడవిట్‌ను దాఖలు చేశారు. కరోనా కేసులు తగ్గుతుందన్నందున పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఒక్కో పరీక్షా కేంద్రలో 15 నుంచి 18 మంది విద్యార్ధులను ఉంచుతామని చెప్పింది. పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలిపింది. పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనం లో కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తామని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కోంది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 80,712 శాంపిళ్లను పరీక్షించగా.. 4,684 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,62,036కి చేరింది. నిన్న 7,324 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,98,380కి పెరిగింది. నిన్న ఒక్కరోజే 36 మంది ప్రాణాలు కోల్పోగా.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,452కి చేరింది. ఇక రాష్ట్రంలో 51,204 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,13,61,014 సాంపిల్స్ ని పరీక్షించారు.