తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

By Medi Samrat
Published on : 7 Aug 2025 5:30 PM IST

తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అతడి విడుదలపై కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని వెల్లడించింది. కిషోర్ అరెస్ట్ విషయంలో పోలీసులు చట్ట నిబంధనలు ఉల్లంఘించారని, అయితే మేజిస్ట్రేట్ మైండ్ అప్లై చేయలేదని ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నామంటూ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ప్రాసిక్యూషన్‌ను ఆదేశించింది. తురకా కిషోర్‌కు ఇటీవల అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. దీంతో గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఆ వెంటనే మరో కేసులో అతడిని రెంటచింతల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story