రైతుల పాదయాత్రపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

AP High Court took a key decision on farmers' march. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్ తో రైతులు చేపట్టిన పాదయాత్రపై

By Medi Samrat  Published on  1 Nov 2022 3:30 PM GMT
రైతుల పాదయాత్రపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్ తో రైతులు చేపట్టిన పాదయాత్రపై అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు పాదయాత్ర చేస్తున్న రైతులు దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. రైతులు వెంటనే పాదయాత్రను ప్రారంభించుకోవచ్చని.. గుర్తింపు కార్డులు ఉన్న వారు మాత్రమే యాత్రలో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాదయాత్రపై ప్రభుత్వం, రైతులు దాఖలు చేసుకున్న పిటిషన్లపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు యాత్రకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చేది లేదని తేల్చి చెప్పింది. అమరావతి టూ అరసవెల్లి మహాపాదయాత్ర పేరిట ఇటీవలే ప్రారంభమైన రైతుల పాదయాత్ర డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిలిచిపోయింది. గుర్తింపు కార్డులు చూపాలంటూ రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఈ యాత్ర ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాత్రను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం, యాత్రలో పాలుపంచుకునే వారికి మరిన్ని వెసులుబాటులు కల్పించాలంటూ అమరావతి రైతులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ రెండు పిటిషన్లను కలిపి మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. యాత్రలో పాలుపంచుకునే రైతులకు తక్షణమే గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని పోలీసులను ఆదేశించింది. పాదయాత్రకు మద్దతు తెలిపే వారు ఏ రూపంలో అయినా సంఘీభావం తెలపవచ్చని సూచించింది.


Next Story