ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. జంబ్లింగ్‌ విధానంపై హైకోర్టు కీలక తీర్పు

AP High Court suspends Inter practical exam notification. ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌. ఇంటర్‌ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇటీవల తీసుకు

By అంజి  Published on  10 March 2022 7:34 AM GMT
ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. జంబ్లింగ్‌ విధానంపై హైకోర్టు కీలక తీర్పు

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌. ఇంటర్‌ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వారు చదువుతున్న కాలేజీల్లోనే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇదిలా ఉండగా ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని తీసుకురావాలని ఇంటర్మీడియట్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు.

ఒకే కాలేజీలో చదువుతున్న విద్యార్థులు వేర్వేరు కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకావాలని జీవో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో పాత విధానంలోనే ప్రాక్టికల్ పరీక్షలు చేయొచ్చు. ఇదిలా ఉంటే ఏపీలో ఇంటర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 22వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. జేఈఈ మెయిన్‌ పరీక్షల నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇటీవల మార్చారు.

Next Story