ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియ‌స్

AP High Court Serious On Govt. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. కోర్టు ధిక్కారం కేసులో నలుగురు ఐఏఎస్ లు

By Medi Samrat
Published on : 9 Aug 2021 4:13 PM IST

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియ‌స్

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. కోర్టు ధిక్కారం కేసులో నలుగురు ఐఏఎస్ లు హైకోర్టుకు హాజరయ్యారు. హైకోర్టుకు హాజరైన వారిలో పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీ లక్ష్మి, ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ లు ఉన్నారు. పాఠశాలల భవనాలలో రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయం నిర్మాణంపై ధిక్కారణ కేసుపై న్యాయస్థానం విచారణ జరిపింది. స్కూల్ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పేద పిల్లలు చదువుకునే స్కూల్‌ల‌లో వాతావరణం కలుషితం చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్య‌క్తం చేసింది. మీలో ఎవరైనా ఈ పాఠశాలలో చదువుకున్నారా..? అని హైకోర్టు జడ్జి దేవానంద్ అధికారుల‌ను ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా నిర్మాణాలు ఎందుకు కొనసాగుతున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. పాఠశాల ఆవరణలోకి రాజకీయాలు ఎలా తీసుకెళ్తారని హై కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది. ఆగస్టు 31న కూడా అధికారులంతా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. అన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నివేదిక ఇస్తామన్న ఏజీ కోర్టుకు తెలిపారు.


Next Story