కరోనా లాంటి విపత్కర పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని కొన్ని ప్రవేట్ ఆస్పత్రులు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇటువంటి ఘటనలు అనేకం చూశాం. ఈ విషయంపై అఖిల భారత న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిల్ పై ఏపీ హైకోర్టు ఆదేశాలు కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో కోవిడ్ నోడల్ ఆఫీసర్‌కు విధులు నిర్దారించింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ.
రోగుల నగదు చెల్లింపులు నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరగాలని హైకోర్టు సూచించింది. రోగులకు బిల్లులు ఇచ్చే ముందుగా నోడల్ ఆఫీసర్ సంతకం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బిల్లులు ఇచ్చారా లేదా పరిశీలించాలని పేర్కొంది. నోడల్ అధికారి సంతకం లేకుండా కోవిడ్ ఆసుపత్రులు నగదు తీసుకోకూడదని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రతి కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స నగదుకు సంబంధించి డిస్ ప్లే బోర్డ్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. హైకోర్టు ఆదేశాలు అమలు జరిగిలా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఎంహెచ్ఓలను హైకోర్టు ఆదేశించింది.