గణేశ్ ఉత్సవాలకు హైకోర్టు అనుమతి

AP High Court Gives Permission For Ganesh Idols. గణేశ్ ఉత్సవాలకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. గణేశ్ ఉత్సవాలకు సంబంధించి

By Medi Samrat
Published on : 8 Sept 2021 7:08 PM IST

గణేశ్ ఉత్సవాలకు హైకోర్టు అనుమతి

గణేశ్ ఉత్సవాలకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. గణేశ్ ఉత్సవాలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ప్రైవేట్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించుకోవచ్చ‌ని పేర్కొంది. మత కార్యక్రమాలను నిరోధించే హక్కు ప్రభుత్వానికి లేదని స్ప‌ష్టం చేఇంది. ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని సూచించింది. పబ్లిక్ స్థలాల్లో గణేశ్ ఉత్సవాలు నిర్వహించకూడదని తెలిపింది. ప్రైవేట్ స్థలాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

పబ్లిక్ స్థలాల్లో వినాయ‌క ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలను హైకోర్టు సమర్థించింది. ప్రైవేటు స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.


Next Story