థర్డ్ వేవ్ వచ్చే అవకాశం.. ప్రభుత్వం సిద్ధంగా ఉందా: హైకోర్టు

AP High Court Asks Government. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కరోనా ప్రభావం

By Medi Samrat  Published on  3 Jun 2021 2:07 PM GMT
థర్డ్ వేవ్ వచ్చే అవకాశం.. ప్రభుత్వం సిద్ధంగా ఉందా: హైకోర్టు
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కరోనా ప్రభావం ఇటీవలే కాస్త తగ్గుతూ వస్తోంది. అయితే రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నుండి ఈ ప్రశ్నలు ఈరోజు ఎదురయ్యాయి.


కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని.. థర్డ్ వేవ్ ను ఎదుర్కోడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఏపీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మందుల కొరత.. ఆసుపత్రుల్లో బెడ్స్ కొరతపై కూడా పలు సూచనలను ఏపీ హైకోర్టు చేసింది. ఎంబీబీఎస్ పరీక్షలు రాసిన వారిని, నర్సులను కూడా విధుల్లోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సలహాను ఇచ్చింది.

బ్లాక్ ఫంగస్ మెడిసిన్‌ బ్లాక్‌ మార్కెట్‌పై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ప్రశ్నించగా.. ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రం సరిపడా ఇంజక్షన్లు సరఫరా చేయటం లేదని.. 1,400 మంది పేషేంట్స్‌కు 13 వేల ఇంజక్షన్లు మాత్రమే ఇచ్చారని ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కో రోగికి రోజుకి 3 ఇంజక్షన్ల చొప్పున 15 రోజులు ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. బ్లాక్ ఫంగస్ రోగుల కోసం 50 వేల ఇంజక్షన్లు అవసరం ఉందని తెలిపింది. ప్రైవేట్ ఫార్మా కంపెనీల నుంచి ప్రభుత్వం కొనుగోలుకి సిద్ధమైందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.


Next Story