ముస్లింలకు ఏపీ ప్రభుత్వం రంజాన్ కానుక..ఆ బకాయిల విడుదలపై సీఎం ప్రకటన

విజయవాడలో నిర్వహించిన ఇఫ్తార్‌ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లిం మైనారిటీలకు పలు కీలక హామీలు ఇచ్చారు.

By -  Knakam Karthik
Published on : 16 March 2026 8:30 PM IST

Andrapradesh, CM Chandrababu ,AP Govt, Ramadan Tohfa, Imam Mouzams, MuslimWelfare

ముస్లింలకు ఏపీ ప్రభుత్వం రంజాన్ కానుక..ఆ బకాయిల విడుదలపై సీఎం ప్రకటన

విజయవాడలో నిర్వహించిన ఇఫ్తార్‌ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లిం మైనారిటీలకు పలు కీలక హామీలు ఇచ్చారు. ఇమామ్‌లు, మౌజమ్‌లకు పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలు, ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లిస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేయడం సమ్మిళిత పాలనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ముస్లిం మైనారిటీల ఆర్థికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి కోసం ప్రత్యేకంగా 'ఆటోనగర్' ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే, రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆక్రమణల నుండి కాపాడతామని, ఆ వనరులను ముస్లింల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం మాత్రమే వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. మైనారిటీల మనోభావాలను గౌరవిస్తూ, వారి అభ్యున్నతే లక్ష్యంగా సంకీర్ణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చంద్రబాబు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

Next Story