మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న పూసపాటి రాజ వంశీకురాలు సంచయిత గజపతికి ఏపీ సర్కారు కీలక పదవి కట్టబెట్టింది. తూర్పుగోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు ఆమెను చైర్ పర్సన్‌గా నియమించింది. ఈ మేరకు దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ వెలువడ్డాయి.
గతంలో సింహాచలం ఆలయంతోపాటు తూర్పుగోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు చైర్మన్‌గా సంచయిత తండ్రి ఆనందగజపతిరాజు వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన సోదరుడు, కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చైర్మన్ గా కొనసాగారు. ఈ క్రమంలో ఆనందగజపతిరాజు వారసురాలిగా సంచయితను చైర్మన్‌గా నియమించాలని దేవాదాయశాఖకు ప్రభుత్వం అక్టోబర్ 27న లేఖ రాసింది. రూ.2 లక్షల కంటే తక్కువ ఆదాయమున్న 104 ఆలయాలకు సంచయిత చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తారు. సింహాచల దేవస్ధానం పాలక మండలి చైర్ పర్సన్‌గా ఆనంద గజపతిరాజు రెండో కుమార్తె సంచయితను ప్రభుత్వం నిమయించిన విషయం తెలిసిందే. ఈ తర్వాత విజయనగరరాజుల ఆధీనంలో మాన్సస్ ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్ ఆమెకు బాధ్యతలు అప్పగించారు.