2021 సెలవుల జాబితాను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
AP Govt Releases 2021 Holidays List. 2021 సంవత్సరానికి గానూ సాధారణ సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
By Medi Samrat
2021 సంవత్సరానికి గానూ సాధారణ సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ సెలవులు ఎక్కువగా ఆదివారం రాకపోవడంతో ఉద్యోగులకు సంతోషం కలిగిస్తోంది. అయితే.. ఐచ్ఛిక సెలవులు మాత్రం నాలుగు ఆదివారాలు వచ్చాయి. సాధారణ సెలవుల్లో స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15వ తేదీ మాత్రమే ఆదివారం వచ్చింది. మిగతా సెలవులన్నీ ఇతర వారాల్లోనే వచ్చాయి. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
సెలవులు ఇవే..
జనవరి 13 - బుధవారం - భోగి
జనవరి 14 - గురువారం- మకర సంక్రాంతి
జనవరి 26 - మంగళవారం - గణతంత్ర దినోత్సవం
మార్చి 11 - గురువారం - మహాశివరాత్రి
ఏప్రిల్ 1 - గురువారం - వార్షిక అకౌంట్స్ ముగింపు దినోత్సవం
ఏప్రిల్ 2 - శుక్రవారం - గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 13 - మంగళవారం - ఉగాది
ఏప్రిల్ 4 -బుధవారం - డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిమే 1 - శుక్రవారం - మే డే
మే 14 - శుక్రవారం - రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్)
జూలై 21 - బుధవారం - బక్రీద్ (ఈద్-ఉల్-అజా)
ఆగష్టు 15 - ఆదివారం - స్వాతంత్ర్య దినోత్సవం
ఆగష్టు 19 - గురువారం- మొహర్రం
ఆగష్టు 30 - సోమవారం - శ్రీ కృష్ణాష్ఠమి
అక్టోబర్ 2 - శనివారం - మహాత్మాగాంధీ జయంతి
అక్టోబర్ 15 - శుక్రవారం - విజయదశమి
నవంబర్ 4 - గురువారం - దీపావళి
డిసెంబర్ 25 - శనివారం - క్రిస్మస్
మొత్తం 22 జనరల్ హాలిడేస్ 18 ఆప్షనల్ హాలిడేస్‌ను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక కొత్త సంవత్సరంలో వారాంతాల్లో అధికంగా పండగలు ఉండటం, పలు పండగలకు ఒకటి లేదా రెండు రోజుల సెలవుతో లాంగ్ వీకెండ్స్ రానుండటం ఉద్యోగ వర్గాలకు శుభవార్తే.