మ‌రోమారు టీటీడీ చైర్మన్‌ గా వైవీ సుబ్బారెడ్డి

AP Govt Once Again Appoints YV Subba Reddy as TTD Chairman. టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) బోర్డు చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి

By Medi Samrat  Published on  8 Aug 2021 9:57 AM GMT
మ‌రోమారు టీటీడీ చైర్మన్‌ గా వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) బోర్డు చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. ఇటీవల వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ బాధ్యతలను మరోసారి ఆయనకే అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక‌ టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. అయితే, ఆయన పదవీ కాలం పూర్తయ్యాక వేరే వ్యక్తిని నియమించే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు వినిపించాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రభుత్వం సుబ్బారెడ్డికే బాధ్యతలు అప్పగించింది. త్వరలోనే బోర్డు సభ్యులను కూడా నియమించనున్నట్లు స‌మాచారం.

Next Story
Share it