AP: పాఠశాలల్లో 3 సార్లు వాటర్ బెల్.. విద్యాశాఖ సూచన

పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మూడుసార్లు నీటి విరామం ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మంగళవారం నాడు తప్పనిసరి చేసింది.

By అంజి  Published on  3 April 2024 8:43 AM IST
AP govt, schools, water breaks, students

AP: పాఠశాలల్లో 3 సార్లు వాటర్ బెల్.. విద్యాశాఖ సూచన

అమరావతి: పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మూడుసార్లు నీటి విరామం ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మంగళవారం నాడు తప్పనిసరి చేసింది. వాటర్-బెల్ ఇనిషియేటివ్‌గా పిలువబడే ఈ విరామాలు ఉదయం 8:45, 10:05 , 11:50 గంటలకు ఇవ్వబడతాయని పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. రోజుకు మూడు సార్లు వాటర్‌ బెల్‌ కొట్టాలని సూచించారు. ఆ సమయంలో విద్యార్థులు తప్పకుండా నీరు తాగేలా చూడాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో క్రమం తప్పకుండా వాటర్‌ బెల్ మోగించాలని విద్యాశాఖ ఆదేశించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకారం.. రాష్ట్రంలో పలు చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా పాఠశాలల్లో వాటర్‌ బెల్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇదిలావుండగా, మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 68 మండలాల్లో వేడిగాలులు వీచాయని, తొమ్మిది మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. అయితే, బుధవారం రెండు మండలాల్లో మాత్రమే వేడిగాలులు వీస్తాయని అంచనా వేసింది.

Next Story