ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలను ప్రారంభించింది. దీంతో పాటు అన్ని జిల్లాల్లోనూ నిన్నటితో పాలన మొదలైంది. రాష్ట్రంలో గతంలో 13 జిల్లాలు ఉండగా, ప్రభుత్వం మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయడంతో ఏపీలో మొత్తం ఏపీ కొత్త జిల్లాల సంఖ్య 26కి చేరింది. పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కలెక్టర్లు, ఎస్పీలను కూడా నియమించింది.
కాగా, ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశం ఉందని నాని మంగళవారం తెలిపారు. గిరిజన ప్రాంతాలన్నింటినీ కలిపి ఒకే జిల్లాగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశం ఉందని నాని అభిప్రాయపడ్డారు. త్వరలో గిరిజన జిల్లా ఏర్పాటును సీఎం సీరియస్‌గా పరిగణిస్తున్నారని.. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో రెండు జిల్లాలు ఏర్పాటైనందున మరో జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం ఆలోచిస్తోందని నాని స్పష్టం చేశారు. పాలనను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.