వారికి ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

పవర్ లూమ్ చేనేతలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పవర్ లూమ్‌లకు విద్యుత్ సబ్సిడీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

By Medi Samrat
Published on : 22 Feb 2024 7:24 PM IST

వారికి ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

పవర్ లూమ్ చేనేతలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పవర్ లూమ్‌లకు విద్యుత్ సబ్సిడీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యూనిట్‌కి 94 పైసలు రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.1 నుంచి 6 పైసలకి తగ్గించింది. పవర్ లూమ్స్ నిర్వహించే చేనేతలకు మేలు చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఎన్నికలకు ముందు పలు రంగాల ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ల మీద గుడ్ న్యూస్ చెబుతూ వెళుతోంది. రెండు రోజుల కిందటే ఏపీ ప్రభుత్వం సమగ్రశిక్ష ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. జీతాలు 23 శాతం పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. 2019 నుంచి ఒక్కసారి కూడా జీతం పెరగని వారికి ఇది వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. సెక్షన్‌ ఆఫీసర్లు, సిస్టమ్‌ ఎనలిస్టులు, సైట్‌ ఇంజనీర్లు (బీటెక్‌), సైట్‌ ఇంజనీర్లు (డిప్లొమా), మెసెంజర్స్‌, ఐఈఆర్‌టీలు, పార్ట్‌టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్లు, డేటా ప్రాసెసింగ్‌ ఆఫీసర్లు, డ్రైవర్లకు జీతం పెరిగింది.

Next Story