ఇల్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త

సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది.

By అంజి  Published on  20 Dec 2024 1:46 AM GMT
AP Govt, home builders, APnews, CM Chandrababu

ఇల్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త

అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో 100 గజాల్లో (రెండు సెంట్లు) ఇల్లు కట్టుకునేవారికి తాజాగా కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. మున్సిపాల్‌ కార్యాలయాల చుట్టే తిరగకుండా వారికి ప్లాన్‌ అఫ్రూవల్‌ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది. అలాగే 300 గజాల్లోపు ఇల్లు నిర్మించుకునేవారికి అనుమతులు మరింత సులభతరం చేయనుంది. కాగా ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. నిన్న జరిగిన కేబినెట్‌ భేటీలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని 475 జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా 1.41 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. క్లీన్ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టే పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులతో విద్యుదుత్పత్తి యూనిట్ల స్థాపనకు ఎన్టీపీసీ నిర్ణయం తీసుకుంది.

హంద్రీనీవా సుజల స్రవంతి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్‌కు అనుమతి ఇస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 10 జిల్లాల్లోని వరద ప్రభావిత బాధితులకు రుణాల రీషెడ్యూల్‌ చేయటానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపునకు కూడా క్యాబినెట్ అంగీకరించింది. సీఆర్‌డీఏ 42, 43 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని నిర్మాణం కోసం రూ.33,137.90 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది.

Next Story