ప్రధానోపాధ్యాయుడి కొడుక్కి యూపీఎస్సీ పరీక్షలో 28వ ర్యాంక్
AP govt high school headmaster's son bags 28th rank in UPSC exam. సివిల్స్ 2021 ఫలితాల్లో ఏపీలోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకి చెందిన మంత్రి మౌర్య భరద్వాజ్
By Medi Samrat Published on 30 May 2022 3:00 PM GMTసివిల్స్ 2021 ఫలితాల్లో ఏపీలోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకి చెందిన మంత్రి మౌర్య భరద్వాజ్ సత్తాచాటాడు. 28వ ర్యాంక్ సాధించాడు. IAS 2021 ఫలితాలు సోమవారం ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సీపట్నంకు చెందిన మంత్రి మౌర్య భరద్వాజ్ టాపర్‌లలో ఒకరు (ఆల్ ఇండియా ర్యాంక్ 28)గా నిలిచారు. ఈ ఘనత సాధించిన మంత్రి మౌర్య భరద్వాజ్ తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే..! తన తల్లిదండ్రులే తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చాడు మౌర్య. అతని తండ్రి సత్య ప్రసాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా, తల్లి రాధా కుమారి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నారు.
ఎన్ఐటీ వరంగల్ కు చెందిన భరద్వాజ్.. రూరల్, అర్బన్ జీవితాలను చూసిన వ్యక్తే..! అతను గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి MNCలో పనిచేశాడు. సమాజానికి ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకే ఐఏఎస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. ఐదో ప్రయత్నంలో అతనికి ర్యాంక్ వచ్చింది. "నేను నా ఉద్యోగం మానేసి సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ కావడం ప్రారంభించాను. కానీ రెండు మూడు ప్రయత్నాల తరువాత, నేను నా ఉద్యోగానికి తిరిగి వచ్చి ప్రిపరేషన్ మొదలుపెట్టాను. నేను సివిల్స్ పై ఆశలు వదులుకున్న సందర్భాలు ఉన్నాయి, కానీ మా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ నాకు మద్దతు ఇచ్చారు. వారు నన్ను వెనక్కి తగ్గాలని కోరుకోలేదు" అన్నాడు భరద్వాజ్. సమాజానికి ఏదో ఒక మేలు చేసేందుకు ఈ ఉద్యోగం ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు మౌర్య భరద్వాజ్.
ర్యాంకర్లను అభినందించిన ముఖ్యమంత్రి :
తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్ సర్వీస్ పరీక్షల్లో 15వ ర్యాంకు సాధించిన యశ్వంత్ కుమార్ రెడ్డిని, ఇతర ర్యాంకర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. 685 మందిలో ఉన్న పి.సాహిత్య (ర్యాంక్ 24), శృతి రాజ్యలక్ష్మి (25), రవికుమార్ (38), కె. కిరణ్మయి, పాణిగ్రాహి కార్తీక్, జి. సుధీర్ కుమార్ రెడ్డి, శైలజ, శివానందం, ఎ. నరేష్‌లను ఆయన అభినందించారు.