ఏపీ విద్యార్థుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్.. ఇక‌పై ఎంసీఏ రెండేళ్లే..

AP Govt Good News to Students. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(MCA)

By Medi Samrat  Published on  22 Dec 2020 5:08 AM GMT
ఏపీ విద్యార్థుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్.. ఇక‌పై ఎంసీఏ రెండేళ్లే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(MCA) కోర్సు వ్యవధిని రెండేళ్లకు తగ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకుని రానున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుతం ఈ కోర్సు వ్య‌వ‌ధి మూడు సంవ‌త్స‌రాలుగా ఉంది.

ఈ నిర్ణయంతో 2020-21నుంచి MCA రెండేళ్ల కోర్సుగా మారనుంది. అందుకు సంబంధించిన క‌రికులంను రూపొందించాలంటూ వీసీల‌కు ఆదేశాలు జారీ చేసింది. మ్యాథ్స్ చదివిన బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, కామర్స్, ఆర్ట్స్ గ్రాడ్యుయేట్స్‌కు ఎంసీఏ రెండేళ్లు మాత్రమే పరిగణించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీని వల్ల విద్యార్థులకు ఒక ఏడాది ఆదా అవుతుంది. మరోవైపు ఈ విధానాన్ని మహారాష్ట్రలో ఈ ఏడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.

గతంలో ఏఐసీటీఈ (AICTE )కూడా ఎంసీఏ కోర్సును రెండేళ్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. 1990 ప్రాంతంలో ఈ కోర్సును ప్రవేశపెట్టగా.. దశాబ్దకాలం నుంచి ఈ కోర్సుకు ఆదరణ కరువైంది. ఇక నుంచి ఎంసీఏ మూడేళ్లు (6 సెమిస్టర్లు) బదులుగా రెండేళ్లు (4 సెమిస్టర్లు)లో పూర్తి చేస్తే పట్టా పొందవచ్చు.


Next Story