నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

By -  Medi Samrat
Published on : 13 Nov 2025 5:33 PM IST

నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని పంచాయితీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఉన్న కాంప్లెక్సుల్లో నాయీ బ్రాహ్మణులకు షాపులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన మెమోలను కూడా బీసీ సంక్షేమ శాఖ విడుదల చేసింది. 1996లోని జీవో 13 ను అనుసరించాలని కలెక్టర్లు, కార్పొరేషన్లు, మున్సిపల్ అధికారులకు ఉత్తర్వుల్లో సూచించింది.

ఇక కొద్ది నెలల కిందట నాయీ బ్రాహ్మణుల జీతాల పెంపు విషయంలో దేవాదాయ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నెలవారీ భృతిని రూ. 25 వేలకు పెంచుతూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 44, 6ఏ కేటగిరీ దేవాలయాల్లో కేశఖండన చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు వర్తించేలా ఈ జీవో జారీ చేసింది. నెలవారీ భృతిని 20 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Next Story