చిరు వ్యాపారులకు ఏపీ స‌ర్కార్‌ గుడ్‌న్యూస్‌

AP govt. extends Jagananna Thodu scheme to another 3.97 lakh beneficiaries. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం 'జగనన్న తోడు' పథకం ద్వారా

By Medi Samrat  Published on  12 Jun 2022 1:33 PM IST
చిరు వ్యాపారులకు ఏపీ స‌ర్కార్‌ గుడ్‌న్యూస్‌

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం 'జగనన్న తోడు' పథకం ద్వారా రాష్ట్రంలోని మరో 3.97 లక్షల మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10,000 వడ్డీ లేని రుణాలు అందించాలని నిర్ణయించింది. జూన్ 2న ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పథకంపై సమీక్షించిన ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించాలని గ్రామ, వార్డు సచివాలయాలు, సెర్ప్, మెప్మా, గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలతో సహా అన్ని జిల్లాల కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ పథకం ద్వారా రుణాలు పొంది అసలు మొత్తాన్ని సకాలంలో చెల్లించిన వారితోపాటు కొత్త లబ్ధిదారులకు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా తగు చర్యలు తీసుకోవాలని గతంలోనే సూచించింది. ప్రభుత్వం కూడా రాష్ట్ర బ్యాంకర్ల కమిటీకి లేఖ రాసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న రాష్ట్రవ్యాప్తంగా 5.08 లక్షల మంది చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలను సీఎం జగన్‌ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.














Next Story