ఏపీ వైద్య, ఆరోగ్య శాఖలో మరో 2,588 పోస్టులు

AP govt. decides to recruit 2,588 posts in Medical and Health Department. వైద్య, ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరతను తీర్చేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం చర్యలు

By Medi Samrat
Published on : 15 Feb 2022 10:09 AM IST

ఏపీ వైద్య, ఆరోగ్య శాఖలో మరో 2,588 పోస్టులు

వైద్య, ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరతను తీర్చేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే భారీ నియామకాలు చేపట్టింది. మ‌రికొన్ని నియ‌మాకాల‌కు సంక‌ల్పించింది. ఈ నేప‌థ్యంలోనే ఏపీ వైద్య విధాన మండలిలో కొత్త‌గా మరో 2,588 పోస్టులను సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ పంపిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం పోస్టులు సృష్టించిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కొత్త పోస్టుల్లో 485 మంది డాక్టర్ పోస్టులు ఉన్నాయి. నర్సింగ్ పోస్టులు-60, ఫార్మసీ పోస్టులు-78, పారామెడికల్ క్లాస్-4 పోస్టులు-644, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు -279, పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టులు-39, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులు-54, ఇతర పోస్టులు-949 ఉన్న‌ట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా పోస్టులు డైరెక్ట్, పర్మినెంట్, కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రక్రియ ద్వారా భర్తీ చేయబడతాయి. మరికొన్ని పోస్టులు పదోన్నతులు క‌ల్పించ‌డం ద్వారా భ‌ర్తీ అవుతాయి.


Next Story