కోనసీమ జిల్లా పేరు మార్పు

AP govt. changes the Konaseema district name. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని ముఖ్యమంత్రి

By Medi Samrat
Published on : 18 May 2022 5:29 PM IST

కోనసీమ జిల్లా పేరు మార్పు

కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. అమలాపురం కేంద్రంగా ఉన్న కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని దళితులు, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై పలుమార్లు ఆందోళనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లాకు డా.బీఆర్‌ అంబేద్కర్‌ పేరును చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.







Next Story