రేపు సెలవు ప్రకటించిన ఏపీ సర్కార్

AP Govt announces holiday tomorrow. మహమ్మద్‌ ప్రవక్త జన్మదినం 'ఈద్‌ మిలా ఉన్‌ నబీ' సెలవు గతంలో ఈ నెల 20 తేదీగా ఉండగా..

By అంజి  Published on  18 Oct 2021 8:12 AM GMT
రేపు సెలవు ప్రకటించిన ఏపీ సర్కార్

మహమ్మద్‌ ప్రవక్త జన్మదినం 'ఈద్‌ మిలా ఉన్‌ నబీ' సెలవు గతంలో ఈ నెల 20 తేదీగా ఉండగా.. ఇప్పుడు 19వ తేదీకి మారుస్తూ గవర్నమెంట్‌ హాలిడేను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు సాధారణ పరిపాలనా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 19నే సాధారణ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సీఈవో సూచన మేరకు ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఇస్లాం క్యాలెండర్‌ ప్రకారం.. రబీ-అల్‌-అవ్వల్లో పౌర్ణమి ముందు రోజు మహమ్మద్‌ ప్రవక్త జన్మించినట్టు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది.

తన 40వ ఏటా ప్రవక్త పదవి వరించిందని ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. మహమ్మద్‌కు మహ్మద్‌ ప్రవక్త జయంతి వేడుకలను అరబ్‌లో 'మిలాద్‌ – ఉన్‌ – నబీ' అని అంటారు. ప్రపంచ శాంతి నెలకొల్పడం కోసమే ఆఖరి ప్రవక్తగా మహమ్మద్‌ను ఎన్నుకున్నట్లు ఖురాన్‌లో చెప్పబడింది. విశ్వానికి ప్రవక్తగా అల్లాహ్‌ నియమించారని అందులో పేర్కొన్నారు. రేపు ప్రపంచ దేశాల్లో మహమ్మద్‌ ప్రవక్త జన్మదిన వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.

Next Story
Share it