గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైల్‌కు గవర్నర్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఇటీవలే మండలిలో నలుగురు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేశారు. దాంతో వైసీపీ నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసింది. లేళ్ల అప్పిరెడ్డి(గుంటూరు జిల్లా), తోట త్రిమూర్తులు(తూర్పుగోదావరి), మోషేన్‌ రాజు(పశ్చిమగోదావరి), రమేశ్‌ యాదవ్‌(కడప)ల పేర్లను ప్రతిపాదిస్తూ జాబితాను గవర్నర్‌కు పంపింది. తాజాగా సీఎం వైఎస్ జగన్ సోమవారం గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైల్‌ను ఆమోదించాలని కోరారు. జగన్ విజ్ఞప్తితో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైల్‌కు గవర్నర్ హరిచందన్ ఆమోదం తెలిపారు.


సామ్రాట్

Next Story