ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీలో వస్తున్న సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పింఛన్ పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. 1వ తేదీ సెలవు రోజుగా ఉంటే ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు అందించాలని పేర్కొంది. ఇకపై ఇదే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండో తేదీన మిగిలిన పంపిణీ పూర్తి చేయాలని, ఆ రోజూ సెలవు ఉంటే మూడో తేదీన పంపిణీ చేయాలని స్పష్టం చేసింది.
పింఛన్ల పంపిణీ ప్రారంభించిన తొలి రోజే దాదాపు 100 శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ నెల 1వ తేదీ కావడంతో పింఛన్ల పంపిణీ ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగలతో పింఛన్లు పంపిణీ చేయిస్తోంది. పింఛన్ల పంపిణీ విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.