ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ తల్లికి వందనం రెండో విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. 9.51 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్ కేంద్రీయ విద్యాలయాలు, సీబీఎస్‌ఈ, నవోదయల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనూ రెండో విడతలో తల్లికి వందనం నిధులు అందుతాయి. ఇటీవల వీరిని మినహాయించి మిగిలిన వారికి డబ్బులు జమ చేసిన సంగతి తెలిసిందే.
కొంతమంది అర్హులైనప్పటికీ వివిధ కారణాలతో అనర్హులుగా తేలారు. దీంతో వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేశారు. గ్రీవెన్సులను పరిష్కరించగా అర్హులుగా తేలిన వారికి సైతం తల్లికి వందనం జమ చేయనున్నారు. ఇక మొదటి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిన సంగతి తెలిసిందే.
అర్హులుగా గుర్తించిన విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులను జమ చేస్తున్నారు. ఈ స్కీమ్ కింద మొత్తం రూ. 15 వేలు ఇస్తుండగా… వీటిలో రూ. 13 వేలు తల్లి ఖాతాలో జమవుతాయి. మరో రూ. 2 వేలు జిల్లా కలెక్టర్ ఖాతాలోకి వెళ్తాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది.