అమరావతి: తెలుగు సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వం త్వరలోనే కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. కాగా మొదట హోంశాఖ నేతృత్వంలోని అధికారుల సమావేశం, సినిమాటోగ్రఫీ, హోంశాఖ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా సినిమా టికెట్ ధరలపైనే ప్రధాన చర్చ జరగనుంది.
మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్ నిర్వహించే సినిమాలకు సంబంధించి టికెట్ ధరల పెంపు..అదే విధంగా భారీ బడ్జెట్ సినిమాలకు రెట్ల పెంపుపై చర్చించనున్నారు. ఈ శాఖల సమావేశం అనంతరం సినీ పరిశ్రమ ప్రముఖులతో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. కాగా త్వరలోనే ఈ తేదీలను ప్రకటించనున్నారు.