మందుబాబుల‌కు షాక్‌.. మద్యంపై పన్ను రేట్లు సవరిస్తూ నిర్ణ‌యం

AP Government Taxes On Liquor New GO Released. ఏపీలో మద్యంపై పన్ను రేట్లు సవరిస్తూ రాష్ట్ర ఆబ్కారీ శాఖ ఉత్తర్వులిచ్చింది. మద్యం మూల ధరపై

By Medi Samrat  Published on  10 Nov 2021 5:14 PM IST
మందుబాబుల‌కు షాక్‌.. మద్యంపై పన్ను రేట్లు సవరిస్తూ నిర్ణ‌యం

ఏపీలో మద్యంపై పన్ను రేట్లు సవరిస్తూ రాష్ట్ర ఆబ్కారీ శాఖ ఉత్తర్వులిచ్చింది. మద్యం మూల ధరపై తొలి విక్రయం జరిగేచోట పన్ను సవరణతో పాటు దేశంలో తయారైన విదేశీ బ్రాండ్లపై ధర ఆధారంగా పన్నుల్లో మార్పులు చేసింది. రిటైల్‌ ధరలో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది. రూ.400 లోపు ఉన్న బ్రాండ్ల కేసుకు 50% మేర వ్యాట్‌, రూ.400-2,500 మద్యం కేసుకు 60%, రూ.2,500-3,500 వరకు 55%, రూ.5 వేలు, ఆపై మద్యం కేసుపై 45% వ్యాట్‌ వసూల్‌కు నిర్ణయం తీసుకుంది. దేశీయ తయారీ బీర్‌ రూ.200 కంటే తక్కువున్న కేసుపై 50%, రూ.200 ఎక్కువ ఉంటే బీర్‌ కేసుపై 60% వ్యాట్‌ వసూలు చేయనుంది. దీంతో ఇప్ప‌టికే అధిక రేట్ల‌తో విల‌విల‌లాడుతున్న మందుబాబులు.. తాజా బాదుడుతో త‌ల‌ప‌ట్టుకుంటున్నారు.


Next Story