అసంపూర్తిగా మెడికల్ కాలేజీల నిర్మాణం..ఆ విధానంలో పూర్తికి టెండర్ నోటిఫికేషన్ జారీ

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన మెడికల్ కాలేజీల నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

By -  Knakam Karthik
Published on : 18 Sept 2025 1:30 PM IST

Andrapradesh, Ap Government,  medical colleges, Ysrcp, Tdp

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన మెడికల్ కాలేజీల నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ వైద్య సేవలు & మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలు పీపీపీ విధానం లో పూర్తి చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. తొలివిడతలో 4 మెడికల్ కాలేజీలను పిపిపి పద్ధతిలో అప్పగించేందుకు టెండర్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. మెడికల్ కాలేజీలు, 625 పడకల సూపర్ స్పెషలిటీ ఆస్పత్రుల పిపిపికి టెండర్ ప్రకటనను ఏపీ ఎంఎస్ఐడిసి వెల్లడించింది.

Next Story