అమరావతి: తెలంగాణకు చెందిన 58 మంది క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో.. ఏపీ కి వచ్చిన 698 మందిని..గతంలో తెలంగాణకు ఏపీ ప్రభుత్వం పంపింది. అయితే సరైన అవగాహన లేక కొందరు కారుణ్య నియామకంతో, మరి కొందరు  58 మంది ఉద్యోగులు తెలంగాణా ఆప్షన్ పెట్టుకోలేదు. దీంతో తమను కూడా తెలంగాణకు పంపాలని ఆ 58 మంది ఉద్యోగులు కోరారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం విధించిన కొన్ని షరతులతో తిరిగి వారిని సొంత రాష్ట్రానికి పంపుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  
గతంలో 2021లో జీవో 37 ప్రకారం రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి వచ్చిన 698 మంది తెలంగాణ ఉద్యోగులను ఇప్పటికే వారి సొంత రాష్ట్రానికి పంపించారు. వారిలాగే తమకూ సొంత రాష్ట్రానికి వెళ్లే అవకాశం ఇవ్వాలని మిగిలినవారు కోరారు. తెలంగాణ ప్రభుత్వం కొన్ని షరతులకు లోబడి వారిని తీసుకోవడానికి అంగీకరించింది. దీంతో సీఎస్ విజయానంద్ ఈ 58 మందిని సొంత రాష్ట్రానికి పంపేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.