సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఇకపై ఇసుక పూర్తి ఉచితం!

ఉచిత ఇసుక విధానం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక విధానం అమలుపై నామమాత్రపు రుసుములనూ తొలగించింది.

By అంజి  Published on  22 Oct 2024 6:51 AM IST
AP government, sand , APnews, CM Chandrababu

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఇకపై ఇసుక పూర్తి ఉచితం!

అమరావతి: ఉచిత ఇసుక విధానం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక విధానం అమలుపై నామమాత్రపు రుసుములనూ తొలగించింది. పూర్తిగా ఉచితంగా ఇసుక సరఫరా చేసేందుకు రెడీ అయ్యింది. ఇసుకపై సీనరేజ్‌ రద్దు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఇసుక వినియోగదారులకు మరింత ఊరట లభించింది.

సీనరేజ్‌తో పాటు తదితరాల రూపంలో మెట్రిక్‌ టన్నుకు రూ.88 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇకపై దాన్ని కూడా కూడా చెల్లించాల్సిన పని లేద. సీనరేజ్‌ రద్దు నిర్ణయం అమలుకు సంబంధించి గనుల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. రేపు జరిగే కేబినెట్‌ భేటీలో ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేయనున్నారు.

రుతుపవనాల సీజన్‌ ముగియడంతో ఈ నెల 16 నుంచి నదుల్లో కూలీలతో ఇసుక తవ్వకాలు ప్రారంభం అయ్యాయి. ఇందులో సీనరేజ్ ఫీజు మెట్రిక్‌ టన్నుకు రూ.88, నదిలో ఇసుక తవ్వి, ట్రాక్టర్‌లో ఒడ్డుకు తెచ్చి, అక్కడ లారీలో లోడ్‌ చేసిన ఖర్చు కింద ఆయా రీచ్‌ను బట్టి గరిష్ఠంగా రూ.90 నుండి రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. తాజాగా సీనరేజ్‌ ఫీజును సీఎం చంద్రబాబు రద్దు చేశారు.

దీంతో జిల్లా, మండల, గ్రామపంచాయతీలకు జమయ్యే రూ.66 సీనరేజ్‌ ఫీజు, జిల్లా ఖనిజ నిధికి చేరే రూ.20, ఖనిజాన్వేషణ ట్రస్టుకు వెళ్లే రూ.2 కలిపి.. మొత్తం రూ.88 ఇక నుంచి మినహాయింపు ఉంటుంది. నది సమీపంలోని గ్రామాలు, పట్టణాలకు చెందిన వారు తమ నిర్మాణ అవసరాలకు ఇసుక తవ్వి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుకను తీసుకెళ్లొచ్చు. నదికి దూరంగా ఉండేవారు కూడా ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా తీసుకెళ్లొచ్చు.

Next Story