Andhrapradesh: అకౌంట్లోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను కాలేజీల ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

By అంజి  Published on  6 Nov 2024 2:21 AM GMT
AP government , fee reimbursement, colleges, Andhrapradesh

Andhrapradesh: అకౌంట్లోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను కాలేజీల ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించే ఫైలుపై ఇవాళ కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నారు. ఆ తర్వాత విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత విధానంతో కాలేజీలు విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి చేయడంతో కొందరు పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి నెలకొందని ప్రభుత్వం దృష్టికి రావడంతో కాలేజీలకే చెల్లించాలని చూస్తోంది.

2014 - 19 మధ్య టీడీపీ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను కాలేజీల ఖాతాల్లోనే జమ చేసేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధానం తీసుకొచ్చింది. అయితే ఈ విధానం వల్ల కొంతమంది విద్యార్థులు ఫీజులు కట్టలేక పరీక్షలు కూడా రాయలేదు. ఈ క్రమంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను కాలేజీల యాజమాన్య ఖాతాల్లో జమ చేయాలని చూస్తోంది.

Next Story