ఏపీ రైతులకు అలర్ట్.. ఈ నెల 23 వరకే ఛాన్స్
అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
By అంజి
ఏపీ రైతులకు అలర్ట్.. ఈ నెల 23 వరకే ఛాన్స్
అమరావతి: అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో పేరు లేని అర్హులు.. ఈ నెల 23 వరకు గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద గ్రీవెన్స్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చని ఆ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఈ పథకాన్ని అర్హులైన అందరికీ అందించాలనే ప్రభుత్వ ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పథకంలో తమ అర్హత స్థితిని టోల్ ఫ్రీ నెంబర్ 155251కు కాల్ చేసి రైతులు తెలుసుకోవచ్చని చెప్పారు. అదే విధంగా 9552300009 ద్వారా కూడా రైతు అర్హత వివరాలు తెలుసుకోవ చ్చని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం అందించే రూ.2 వేల సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.5 వేలు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం 'వనమిత్ర' యాప్‌ను రూపొందించింది. రైతులు పేర్లు ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని అర్హత బట్టి యాప్‌లో నమోదు చేస్తున్నారు. అర్హత ఉండి లిస్ట్‌లో లేని వారికి ప్రభుత్వం మరో ఛాన్స్ కల్పించింది. మొత్తంగా ఈ నెలాఖరులోగా పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ నిధులు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.